భారత్‌తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన

Published on Mon, 07/13/2026 - 19:46

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో రేపు (జులై 14) జరుగబోయే తొలి వన్డే (మూడు మ్యాచ్‌ల సిరీస్‌) కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో కీలక మార్పులు చేసిన ఆతిథ్య జట్టు, యువ ఆల్‌రౌండర్ జేకబ్ బెతెల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపాలని నిర్ణయించింది.

జేకబ్ బెతెల్, బెన్ డకెట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా, అనుభవజ్ఞుడు జో రూట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో, జోస్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

బౌలింగ్ విభాగంలో సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. భారత బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో సమతూక జట్టును రూపొందించింది.

ఇటీవల టీ20 సిరీస్‌లో భారత్‌పై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్, అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని భావిస్తోంది. రేపటి మ్యాచ్‌ భారతకాలమానం​ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత తుది జట్టును ప్రకటించాల్సి ఉంది.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
జేకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)