Breaking News

ఇటలీదే డేవిస్‌ కప్‌

Published on Tue, 11/25/2025 - 08:08

బొలోగ్నా (ఇటలీ): పురుషుల టెన్నిస్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ‘డేవిస్‌ కప్‌’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్టార్‌ ప్లేయర్‌ జానిక్‌ సినెర్‌ బరిలోకి దిగకుండగానే ఇటలీ జట్టు వరుసగా మూడో సారి డేవిస్‌ కప్‌ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో స్పెయిన్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో మాటియో బెర్‌టిని, ఫ్రావియో కొబొలి విజయాలు సాధించడంతో డబుల్స్‌ మ్యాచ్‌ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇటలీ విజయం సాధించింది. 

ఇటలీ జట్టు డేవిస్‌ కప్‌ కైవసం చేసుకోవడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా... వరుసగా మూడోసారి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్‌లో చివరగా అమెరికా జట్టు 1968 నుంచి 1972 వరకు వరుసగా ఐదు సార్లు చాంపియన్‌గా నిలవగా... ఆ తర్వాత మరే జట్టు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయలేదు. గత రెండు సంవత్సరాలు ఇటలీ జట్టు డేవిస్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ సినెర్‌ ఈ సారి బరిలోకి దిగకపోయినా... బెర్‌టిని, కొబొలి చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు విజయం సాధించింది. 

తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో బెర్‌టిని 6–3, 6–4తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై విజయం సాధించగా... రెండో సింగిల్స్‌ పోరులో కొబొలి 1–6, 7–6 (7/5), 7–5తో జామె మునార్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో ఆ్రస్టేలియాపై 2–0తో విజయం సాధించిన ఇటలీ... సెమీఫైనల్లో బెల్జియంపై కూడా 2–0తో గెలుపొందింది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ లేకుండానే స్పెయిన్‌ బరిలోకి దిగింది. 2019 తర్వాత తొలిసారి ఫైనల్‌ ఆడిన ఆరుసార్లు చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.   

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు