‘భారత్‌కు స్వదేశీ కోచ్‌ ఉంటేనే మేలు’

Published on Mon, 08/12/2024 - 04:13

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్‌ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్‌ కోచ్‌ మనొలొ మార్క్వెజ్‌ అభిప్రాయపడ్డారు. ఇగోర్‌ స్టిమాక్‌ స్థానంలో స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్‌ను ఇటీవల హెడ్‌ కోచ్‌గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్‌ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్‌లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్‌కు హెడ్‌ కోచ్‌ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. 

అయితే భారత్‌ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్‌ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్‌ వివరించారు. ‘భారత్‌ కోచ్‌గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్‌–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌కు ముందు భారత్‌ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని అన్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)