Breaking News

జొనాథన్‌ ‘పసిడి’ గురి.. రష్మికకు రజతం

Published on Sat, 09/27/2025 - 10:13

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో రెండో రోజు భారత్‌కు రెండు పతకాలు లభించాయి. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో జొనాథన్‌ గావిన్‌ ఆంటోనీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రష్మిక సెహగల్‌ రజత పతకాన్ని దక్కించుకుంది. 

ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొనాథన్‌ 244.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అరిగి లుకా (ఇటలీ; 236.3 పాయింట్లు) రజతం, లుకాస్‌ సాంచెజ్‌ (స్పెయిన్‌; 215.1 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. భారత్‌కే చెందిన చిరాగ్‌ శర్మ 115.6 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

అంతకుముందు 21 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో జొనాథన్‌ 586 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో, చిరాగ్‌ శర్మ 578 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో భారత్‌ నుంచి ముగ్గురు  రష్మిక సెహగల్, వన్షిక, మోహిని సింగ్‌ బరిలోకి దిగారు. 

రష్మిక 236.1 పాయింట్లతో రెండో స్థానంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వన్షిక 174.2 పాయింట్లతో ఐదో స్థానంలో, మోహిని 153.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. రెండో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.   

లలిత్‌ గేమ్‌ ‘డ్రా’ 
సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఎంఆర్‌ లలిత్‌ బాబు ఖాతాలో వరుసగా రెండో ‘డ్రా’ చేరింది. విజ్ఞాన్‌ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోరీ్నలో లలిత్‌ బాబు తొలి నాలుగు గేముల్లో గెలుపొందాడు. 

దీపన్‌ చక్రవర్తి (రైల్వేస్‌)తో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం) తో గురువారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను లలిత్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్‌ తర్వాత లలిత్‌ బాబు ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.    

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)