నిరాశపరిచిన బాబర్‌.. ఫైనల్‌కు చేరిన షాదాబ్‌ ఖాన్‌ జట్టు

Published on Sun, 03/17/2024 - 08:47

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్‌ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్‌ నుంచి బాబర్‌ ఆజం సారథ్యంలోని పెషావర్‌ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

జల్మీ బ్యాటర్లలో సైమ్‌ అయూబ్‌(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్‌ హ్యారిస్‌(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్‌ బ్యాటర్లలో మిడిలార్డర్‌ బ్యాటర్లు ఇమాద్‌ వసీం(59 నాటౌట్‌), హైదర్‌ అలీ(52 నాటౌట్‌) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

పెషావర్‌ బౌలర్లలో అయూబ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్‌, ముమ్టాజ్, కుర్రామ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక  మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్‌ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్‌ యూనైటడ్‌ తలపడనుంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)