Breaking News

ఇషాన్ కిష‌న్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌

Published on Sat, 03/15/2025 - 21:23

ఐపీఎల్‌-2025 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. 

ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 18వ ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అయితే ఇంకా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇంకా జ‌ట్టుతో చేర‌లేదు. కాలి మ‌డ‌మ గాయంతో బాధ‌ప‌డుతున్న  క‌మ్మిన్స్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. క‌మ్మిన్స్ ఒక‌ట్రెండు రోజుల్లో జ‌ట్టుతో చేరే అవ‌కాశ‌ముంది.

ఇషాన్ కిష‌న్ విధ్వంసం..
ఇక ప్రాక్టీస్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రా-స్క్వాడ్ సిమ్యులేషన్ మ్యాచ్ ఆడింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎస్‌ఆర్‌హెచ్‌-ఎ, ఎస్‌ఆర్‌హెచ్‌-బి జట్లగా విడిపోయారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌-ఎకు ప్రాతినిథ్యం వహించిన  వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కిషన్‌.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

ఈ క్రమంలో ఇషాన్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తంగా 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్ల త‌ర్వాత‌ వేరే ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు ఔటవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌-ఎ టీమ్‌..  నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. 

కిష‌న్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను స‌న్‌రైజ‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో కిష‌న్‌ను రూ.11.25 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిష‌న్ గ‌త కొన్ని సీజ‌న్ల‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ మెగా వేలానికి ముందు  అత‌డిని ముంబై రిటైన్ చేసుకోలేదు.
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి విధ్వంసక‌ర వీరుడు!

 

ఐపీఎల్‌-2025కు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, కమిందు మెండిస్, సచిన్ హేషన్ బేబీ, అనికేత్, హెన్రిచ్‌ క్లాసెన్ (వికెట్ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , నితీష్ కుమార్ రెడ్డి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)