Breaking News

ఇషాన్ కిష‌న్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో

Published on Mon, 12/23/2024 - 15:58

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద‌ర‌గొట్టిన కిష‌న్‌.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో  జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న కిషన్‌.. సోమవారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.

255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్  లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్‌తో పాటు మరో ఓపెనర్‌ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌ణిపూర్ 7 వికెట్ల న‌ష్టానికి 253 ప‌రుగులు చేసింది. మ‌ణిపూర్ బ్యాట‌ర్ల‌లో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్‌(69) ప‌రుగుల‌తో రాణించారు. జార్ఖండ్ బౌల‌ర్ల‌లో అనుకుల్ రాయ్‌, ఉత్కర్ష్ సింగ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వికాస్ సింగ్‌,సుప్రీయో చ‌క్ర‌వ‌ర్తి త‌లా వికెట్ సాధించారు.

కాగా ఇషాన్ కిష‌న్ గ‌త కొంత‌కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. త‌మ ఆదేశాల‌ను ధిక్క‌రించినందుకు బీసీసీఐ అత‌డిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్‌లో రాణిస్తూ రీఎంట్రీ దిశ‌గా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)