Breaking News

ఇర్ఫాన్ ప‌ఠాన్ విధ్వంసం.. 19 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌

Published on Sat, 07/13/2024 - 10:19

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఫైన‌ల్ బెర్త్‌ను ఇండియా ఛాంపియ‌న్స్ ఖారారు చేసుకుంది. శుక్ర‌వారం ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. 

ఆసీస్ బౌలర్లను పఠాన్ ఊచకోత కోశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే పఠాన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేసి పఠాన్ ఔటయ్యాడు. 

ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు రాబిన్ ఉతప్ప(65), యూసఫ్ పఠాన్‌(51), యువరాజ్ సింగ్‌(59) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరిన‌లుగురి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్‌(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ త‌లప‌డ‌నుంది.

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)