Breaking News

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ క్రికెటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌

Published on Wed, 05/21/2025 - 18:01

ఐర్లాండ్‌ వెటరన్‌ క్రికెటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి ఐరిష్‌ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 

దాదాపు రెండు దశాబ్దాలుగా ఐరిష్‌ క్రికెట్‌కు మూలస్థంభంగా ఉన్న స్టిర్లింగ్‌.. ఆ దేశం తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ20లు ఆడి 10000 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 57 అర్ద సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన 97వ ఆటగాడిగానూ స్టిర్లింగ్‌ రికార్డుల్లోకెక్కాడు. 

ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టిర్లింగ్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టిర్లింగ్‌ తర్వాత ఆండ్రూ బల్బిర్నీ అత్యధికంగా 6055 పరుగులు చేశాడు. ఆతర్వాత కెవిన్‌ ఓబ్రెయిన్‌ 5850, విలియమ్‌ పోర్టర​్‌ఫీల్డ్‌ 5480, హ్యారీ టెక్టార్‌ 3732 పరుగులు చేశారు. 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టిర్లింగ్‌.. ఆ మరుసటి ఏడాది టీ20లు, 2018లో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (మే 21) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఐర్లాండ్‌ 35 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

పాల్‌ స్టిర్లింగ్‌ (54), కార్మిచెల్‌ (16) ఔట్‌ కాగా.. బల్బిర్నీ (87), హ్యారీ టెక్టార్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద స్టిర్లింగ్‌ 10000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్‌ సాధించిన హాఫ్‌ సెంచరీ వన్డేల్లో అతనికి 57వది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)