Breaking News

ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్‌

Published on Sat, 08/19/2023 - 13:52

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్‌ సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇ​క రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్‌ సింగ్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అతడి స్ధానంలో మరో పేసర్‌ అవేష్‌ ఖాన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్‌ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్‌ను పక్కన పెట్టే ఛాన్స్‌ ఉంది.

మరోవైపు ఐర్లాండ్‌ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్‌ డాక్రెల్‌ స్ధానంలో గ్రెత్‌ డెలానీకి ఛాన్స్‌ ఇవ్వాలని ఐరీష్‌ జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉంది.

తుది జట్లు(అంచనా)
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్‌ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

భారత్‌: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రవి బిష్ణోయ్
చదవండి: 
World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)