Breaking News

పసికూనపై ఇంగ్లండ్‌ ప్రతాపం​.. ఫిలిప్‌ సాల్ట్‌ విధ్వంసం​.. 28 బంతుల్లోనే..!

Published on Tue, 09/26/2023 - 19:05

పసికూన ఐర్లాండ్‌పై వరల్డ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్‌ టీమ్‌ పవర్‌ ప్లేలో తమ అత్యధిక స్కోర్‌ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్‌ సాల్ట్‌ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్‌ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.

సాల్ట్‌కు విల్‌ జాక్స్‌ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ జాక్‌ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్‌ డకెట్‌ (54 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్‌ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డకెట్‌తో పాటు సామ్‌ హెయిన్‌ (4) క్రీజ్లో ఉన్నాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో క్రెయిగ్‌ యంగ్‌ 2, వాన్‌ వొయెర్కోమ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో రికార్డు స్కోర్‌ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. 

ఈ మ్యాచ్‌లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. 

  • వన్డే పవర్‌ ప్లేలో ఇంగ్లండ్‌ అత్యధిక స్కోర్‌: 107/2
  • 8 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 100 పరుగుల మార్కును తాకింది
  • వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ: ఫిలిప్‌ సాల్ట్‌ (22 బంతుల్లో)

కాగా, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్‌ రెగ్యులర్‌ టీమ్‌ సభ్యులంతా వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌కు జాక్‌ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)