Breaking News

Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్‌

Published on Thu, 10/03/2024 - 15:35

ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఈశ్వరన్‌ 117 బంతుల్లో సెంచరీ మార్కు తాకడు. మూడో రోజు టీ విరామం సమయానికి రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా స్కోర్‌ 193/3గా (49 ఓవర్లలో) ఉంది. ఈశ్వరన్‌ 108, ఇషాన్‌ కిషన్‌ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ 9, సాయి సుదర్శన్‌ 32, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో మోహిత్‌ అవస్తి, జునెద్‌ ఖాన్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ముంబై స్కోర్‌ కంటే ఇంకా 344 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ అజేయ డబుల్‌ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (57), తనుశ్‌ కోటియన్‌ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో రెండు, సరాన్ష్‌ జైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సూపర్‌ ట్రాక్‌ రికార్డు
ముంబైతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈశ్వరన్‌ ఈ ఫార్మాట్‌లో 167 ఇన్నింగ్స్‌లు ఆడి 50 సగటున 7500 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్‌ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి.

చదవండి: ‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)