IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌.. ఎవ‌రితో ఎవ‌రు ఆడ‌తారంటే?

Published on Wed, 05/28/2025 - 10:33

ఐపీఎల్‌-2025లో లీగ్ ద‌శ మ్యాచ్‌లు సోమ‌వారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియ‌ర్‌-1కు ఆర్హ‌త సాధించింది. 

ఈ క్ర‌మంలో ప్లే ఆఫ్స్‌లో ఏ జ‌ట్టు ఎవ‌రితో త‌ల‌ప‌డుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజ‌న్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానంలో పంజాబ్ కింగ్స్‌(18) నిల‌వ‌గా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల ప‌రంగా ఇరు జ‌ట్లు స‌మంగా ఉన్న‌ప్ప‌టికి బెంగ‌ళూరు కంటే పంజాబ్ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉండ‌డంతో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.

క్వాలిఫ‌య‌ర్‌-1లో పంజాబ్‌, ఆర్సీబీ ఢీ..
టాప్‌-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగ‌డ్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్‌-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధిస్తోంది. అయితే ఇక్క‌డ ఓడిన జ‌ట్టుకు కూడా ఫైన‌ల్ చేరేందుకు మ‌రో ఛాన్స్ ఉంటుంది.  ఓట‌మి చెందిన జ‌ట్టు జూన్ 1న క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబై ఇండియ‌న్స్ లేదా గుజ‌రాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్క‌డ గెలిస్తే ఫైన‌ల్‌కు చేరుకోవ‌చ్చు. 

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్‌, మంబై ఇండియ‌న్స్ మే 30న ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక్క‌డ గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ బెర్త్ కోసం క్వాలిఫ‌య‌ర్‌-2లో క్వాలిఫ‌య‌ర్‌-1లో ఓడిన టీమ్‌తో త‌ల‌ప‌డాల్సి ఉంటుంది. ఇక చివ‌ర‌గా ఫైన‌ల్ జూన్ 3న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:
క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్

ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్

క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్

ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)