Breaking News

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు?

Published on Mon, 04/28/2025 - 20:15

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్ర‌పంచంలోనే అత్యంత ఆద‌ర‌ణ పొందిన క్రికెట్ లీగ్‌గా కొన‌సాగుతోంది.  ఐపీఎల్‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా మార్చేందుకు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తోంది.  ప్రస్తుత 74 మ్యాచ్‌ల నుండి టోర్నమెంట్‌ను 94 మ్యాచ్‌ల సీజ‌న్‌కు విస్త‌రించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. 2028 నుంచే మ్యాచ్‌ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహ‌కాలు చేస్తోంద‌ని ఐపీఎల్ ఛైర్మ‌న్ అరుణ్ ధుమాల్ స్ప‌ష్టం చేశాడు.

"భ‌విష్య‌త్తులో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య‌ను పెంచే అవ‌కాశ‌ముంది. ఇదే విష‌యాన్ని ఐసీసీతో చ‌ర్చిస్తున్నాము. బీసీసీఐలో కూడా అంతర్గతంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ను కూడా ఫ్యాన్స్ ఆద‌రిస్తున్నారు. మ్యాచ్‌ల స‌ఖ్య‌ను పెంచి అభిమానుల‌కు మ‌రింత వినోదాన్ని అందించ‌డ‌మే మా ల‌క్ష్యం. 

ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ తొమ్మిది వారాలు పాటు జ‌రుగుతుంది. దాన్ని 11 వారాల‌కు పెంచాల‌ని ఆలోచిస్తున్నాము. అంటే 74 మ్యాచ్‌ల నుంచి 84 లేదా 94కి పెంచ‌వ‌చ్చు.  ప్ర‌తి జ‌ట్టు సొంత గ‌డ్డ‌పై, ప్ర‌త్య‌ర్థి గ‌డ్డ‌పై రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు వీలు ఉంటుంది" అని ధుమాల్ పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఇప్ప‌టిలో కొత్త ఫ్రాంచైజీల‌ను తీసుకొచ్చే ఆలోచ‌న లేద‌ని ఆయ‌న తెలిపారు. కాగా 59 మ్యాచ్‌లతో ప్రారంభమైన‌ ఐపీఎల్‌.. ప్ర‌స్తుతం 74 మ్యాచ్‌ల సీజ‌న్‌గా కొన‌సాగుతోంది.
 

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)