Breaking News

ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం

Published on Thu, 10/29/2026 - 15:15

ఐపీఎల్‌-2027 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌లు ల‌సిత్‌ మలింగ, పార‌స్ మంబ్రేతో ముంబై తెగ‌దెంపులు చేసుకుంది. వీరిద్ద‌రితో పాటు ఫీల్డింగ్ కోచ్  కార్ల్ హాప్కిన్సన్‌పై కూడా ముంబై యాజ‌మాన్యం వేటు వేసింది. ఈ విష‌యాన్ని ముంబై ఇండియ‌న్స్ ఎక్స్ వేదిక‌గా అధికారికంగా గురువారం ప్ర‌క‌టించింది.

"లసిత్ మ‌లింగ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్ప‌టికీ అంతర్భాగమే. ముంబై ఫ్రాంచైజీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. ముంబై బౌలింగ్ విభాగానికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ఘ‌న‌త అత‌డిది. 

ఆ త‌ర్వాత ఒక మెంటార్‌గా, కోచ్‌గా త‌న సేవ‌ల‌ను అందించి జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించాడు. ముంబై ఇండియ‌న్స్‌తో అత‌డి ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు అతడు బౌలింగ్‌కోచ్‌గా తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు" అని ముంబై ఒక ప్రకటనలో పేర్కొంది.

2024లో ముంబై బౌలింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌లింగ..  వ‌రుస‌గా మూడు సీజ‌న్ల పాటు సేవ‌ల‌ను అందించాడు. అత‌డితో మ‌రో బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన మంబ్రేకు కూడా ముంబై ఇండియ‌న్స్‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది.  2011 నుండి 2017 వరకు ముంబై బౌలింగ్ కోచ్‌గా ప‌నిచేసిన మంబ్రే.. మ‌ళ్లీ 2024 నుండి 2026 వరకు ముంబై ఫ్రాంచైజీలో భాగ‌మ‌య్యాడు. 

కాగా ఇప్ప‌టికే ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ ఇప్ప‌టికే హెడ్‌కోచ్ మహేల జ‌య‌వ‌ర్ద‌నేపై వేటు వేసింది. అత‌డి స్ధానంలో కిరాన్ పొలార్డ్‌ను కొత్త హెడ్‌కోచ్‌గా ముంబై నియ‌మించింది.
చదవండి: అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. ఆ అవకాశాన్ని నేను లాక్కోలేను: తిలక్‌ వర్మ

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)