Breaking News

IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి..?

Published on Wed, 10/30/2024 - 11:40

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితా సమర్పణకు మరి కొద్ది గంటల​ సమయం (అక్టోబర్‌ 31 డెడ్‌లైన్‌) మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. 

ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాయిస్‌ ప్రకారం​ వరుసగా రూ. 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ప్లేయర్‌ని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైన్‌ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి..?
రిటెన్షన్‌ లిస్ట్‌ సమర్పణ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్‌ చేసు​కోబోయే ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం​. ఆర్సీబీ తమ కెప్టెన్‌ ఫాఫ్‌ డెప్లెసిస్‌కు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

వయసు పైబడిన రిత్యా డుప్లెసిస్‌ను వేలానికి వదిలేయాలని ఆర్సీబీ భావిస్తుందట. ఈ క్రమంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ మరోసారి విరాట్‌ వైపు చూస్తుందని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్‌ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. విరాట్‌ 2021 సీజన్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022 సీజన్‌ నుంచి డుప్లెసిస్‌ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)