Breaking News

వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్‌.. ఏకంగా రూ. 23.75 కోట్లు

Published on Sun, 11/24/2024 - 19:21

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్‌ అయ్యర్‌ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన  అయ్యర్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. 

ఆఖరికి ఆ‍ర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్‌ రిటైన్ చేసుకోలేదు.

కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.

ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్‌-2025 వేలంలోకి కేకేఆర్‌ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)