Breaking News

IPL 2025: అన్‌ లక్కీ చహల్‌.. చరిత్రలో తొలి ఆటగాడు

Published on Wed, 06/04/2025 - 18:58

టాలెంట్‌ ఎంతున్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలన్న నానుడు స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ విషయంలో మరోసారి నిరూపితమైంది. ఇతగాడు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చలామణి అవుతున్నా (174 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు).. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా టైటిల్‌ అం‍దించలేకపోయాడు.

2013 సీజన్లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన యుజీ.. ఇప్పటివరకు మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్‌ ఆడాడు. మూడింటిలో అతన్ని అదృష్టం వెక్కిరించింది. 

తొలిసారి యుజీ 2016 సీజన్‌లో ఫైనల్‌ ఆడగా.. ఆ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన ఆర్సీబీకి సన్‌రైజర్స్‌ చేతిలో భంగపాటు ఎదురైంది. రెండో సారి 2022 సీజన్‌లో ఫైనల్‌ ఆడగా.. ఆ మ్యాచ్‌లో అతని జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయంపాలైంది. 

తాజాగా యుజీ ఆడిన మూడో ఫైనల్లో అతని కొత్త జట్టు పంజాబ్‌.. అతని మాజీ జట్టు ఆర్సీబీ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ లెక్కన ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్‌ ఆడి ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన ఏకైక ఆటగాడిగా చహల్‌ చరిత్రకెక్కాడు. ఇది తెలిసి క్రికెట్‌ అభిమానులు అతన్ని అన్‌ లక్కీ ఛార్మ్‌ అని అంటున్నారు. మూడు ఫైనల్స్‌లో అతను ఆటగాడిగా రాణించినా అతని జట్లను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. మూడు ఫైనల్స్‌లో చహల్‌ పొదుపుగానే బౌలింగ్‌ చేసి ఒక్కో వికెట్‌ తీశాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న (జూన్‌ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్‌, ఆర్సీబీ పోటీపోటీగా రాణించి ఫైనల్‌ వరకు చేరాయి. అయితే తుది సమరంలో ఆటగాళ్ల అనుభవం ఆర్సీబీని గట్టెక్కించింది. 

ఫైనల్లో ఓడినా శ్రేయస్‌ సేన శభాష్‌ అనిపించు​కుంది. సీజన్‌ ఆధ్యాంతం ఆ జట్టు ఛాంపియన్‌ గేమ్‌ ఆడింది. అనుభవలేమి ఆటగాళ్లతో శ్రేయస్‌ జట్టును నడిపించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నిన్నటి ఫైనల్లో సైతం ఆ జట్టు అంత ఈజీగా ఆర్సీబీకి తలొగ్గలేదు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ ఊహించిన దానికంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. 

ఆతర్వాత బ్యాటింగ్‌లో సైతం మంచి ఆరంభాన్నే పొందినప్పటికీ మధ్యలో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకుంది. అయినా ఆర్సీబీకి అంత ఈజీగా గెలుపును దక్కనివ్వలేదు. చివరి ఓవర్‌ వరుకు ఆ జట్టు బ్యాటర్‌ శశాంక్‌ సింగ్‌ పోరాడాడు. ఓటమి ఖాయమైనా శశాంక్‌ తగ్గేదేలేదన్నాడు. హాజిల్‌వుడ్‌ వేసిన చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. 

అయినా పంజాబ్‌ గెలుపుకు ఏడు పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో పంజాబ్‌ గుండె ముక్కలైంది. ఈ యేడు శ్రేయస్‌ నేతృత్వంలో టైటిల్‌ ఖాయమని ఆ జట్టు అభిమానులు అనుకున్నారు. కానీ తుది మెట్టుపై ఆర్సీబీ అనుభవం గెలిచింది. ఆ జట్టుకు ఇదివరకే మూడు ఫైనల్స్‌ ఆడిన అనుభవం​ ఉండటంతో కీలక సమయంలో పరిస్థితులను బాగా హ్యాండిల్‌ చేసింది. ఫలితంగా 18 ఏళ్ల తమ టైటిల్‌ కలను సాకారం చేసుకుంది.

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు