IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్‌ రిటెన్షన్‌ లిస్టు ఇదే!

Published on Tue, 10/29/2024 - 19:51

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్‌ నిర్వహించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను కూడా టైటాన్స్‌ రిటైన్‌ చేసుకోనుందట!

పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం
కాగా 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అయితే, ఐపీఎల్‌-2024లో గిల్‌ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్‌ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

అతడికి రూ. 18 కోట్లు
అయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్‌ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 

ఇక వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్‌ అయిన రషీద్‌ ఖాన్‌ సైతం ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్‌ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్‌ చేసుకోనున్నారట.

సాయి కిషోర్‌ను కూడా...
అదే విధంగా.. ఐపీఎల్‌-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్‌ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు షారుఖ్‌ ఖాన్‌,రాహుల్‌ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. 

కాగా షమీ వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్‌ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.

చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్‌ మెసేజ్‌!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)