Breaking News

IPL 2025: శుబ్‌మ‌న్ గిల్‌ది ఔటా? నాటౌటా?

Published on Fri, 05/02/2025 - 22:46

ఐపీఎల్‌-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.

మహ్మద్ షమీ, కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం గిల్ వదలేదు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ఎక్కడ తగ్గలేదు. దీంతో  అతడు దూకుడు చూసి మూడెంకల స్కోర్‌ను అందుకుంటాడని అంతా భావించారు. 

సరిగ్గా ఇదే సమయంలో గిల్‌ను దురదృష్టం వెంటాడింది. అనుహ్యంగా గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.  దీంతో కేవ‌లం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 76 ప‌రుగులు చేసిన గిల్‌.. తీవ్ర నిరాశ‌తో డగౌట్‌కు చేరాల్సి వ‌చ్చింది. అయితే గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది.

ఏమి జరిగిందంటే?
గుజ‌రాత్ ఇన్నింగ్స్ 13 ఓవ‌ర్ వేసిన జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి జోష్ బ‌ట్ల‌ర్‌.. షార్ట్ ఫైన్ లెగ్ దిశ‌గా ఆడాడు. ఆ బంతికి బ‌ట్ల‌ర్‌, గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్ర‌య‌త్నించారు. నాన్‌స్ట్రైక్ నుంచి గిల్ వికెట్ కీప‌ర్ వైపు వ‌చ్చేట‌ప్ప‌టికి బంతిని హ‌ర్ష‌ల్ పటేల్ త్రో చేశాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చేట‌ప్పుడు వికెట్ కీప‌ర్ క్లాసెన్‌ స్టంప్ట్స్ ను ప‌డ‌గొట్టాడు. 

అయితే క్లాసెన్ బంతితో కాకుండా త‌న గ్లౌవ్స్‌తో స్టంప్స్‌ను ప‌డగొట్లు అన్పించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాళ్లు అంత ఉత్సాహంగా అప్పీల్ చేయ‌లేదు. ఏదేమైన‌ప్ప‌టికి ఫీల్డ్ అంపైర్‌లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు. రీప్లేలు గిల్ క్రీజుకు షార్ట్‌గా ఉన్నప్పటికీ, క్లాసెన్ తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను ప‌డ‌గొట్టిన‌ట్లు క‌న్పించింది. కానీ ప‌లు కోణాల్లో రిప్లేల‌ను ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని ఔట్‌గా ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చాడు. థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై గిల్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ మైదానాన్ని వీడాడు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)