SRH Vs KKR: కోల్‌కతాపై సన్‌రైజర్స్‌ గ్రాండ్‌ విక్టరీ..

Published on Sun, 05/25/2025 - 23:24

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 110 ప‌రుగుల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

క్లాసెన్‌ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి  ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్‌(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్‌(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.

అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో మ‌నీశ్ పాండే(37) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. హ‌ర్షిత్ రాణా(34), సునీల్ న‌రైన్‌(31) ప‌ర్వాలేద‌న్పించారు. మిగితా కేకేఆర్ బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో జ‌య్‌దేవ్ ఉన‌ద్క‌ట్, మలింగ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హ‌ర్ష్‌దూబే త‌లా రెండు వికెట్లు సాధించారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)