Breaking News

IPL 2025: రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్‌.. ఇక క‌ష్ట‌మే మ‌రి?

Published on Mon, 04/21/2025 - 19:01

ఐపీఎల్‌-2025లో వ‌రుస ఓటుముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్పుడు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 24న చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో రాజ‌స్తాన్ తాడోపేడో తెల్చుకోనుంది.

ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే రాజ‌స్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం. అయితే ఈ మ్యాచ్‌కు రాయ‌ల్స్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు కెప్టెన్ సంజూ శాంస‌న్ గాయం దూర‌మ‌య్యాడు. సంజూ ప్ర‌స్తుతం ప‌క్క‌టెముక‌ల నొప్పితో బాధ‌పడుతున్నాడు. 

అత‌డు గాయం నుంచి కోలుకోవ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు శాంస‌న్ దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని రాయ‌ల్స్ ఫ్రాంచైజీ ధ్రువీక‌రించింది. శాంస‌న్ కోలుకుంటున్నాడ‌ని, జ‌ట్టుతో పాటు బెంగ‌ళూరుకు వెళ్ల‌కుండా జైపూర్‌లోనే ఉండిపోయిన‌ట్లు రాజ‌స్తాన్ మెనెజ్‌మెంట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

దీంతో అత‌డి స్ధానంలో రియాన్ ప‌రాగ్ కెప్టెన్‌గా కొన‌సాగ‌నున్నాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్య ఓట‌ములను చ‌విచూసింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై సూప‌ర్ ఓవ‌ర్‌లో ప‌రాజ‌యం పాలైన రాజ‌స్తాన్‌.. ఆఖ‌రి మ్యాచ్‌లో ల‌క్నోపై 2 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. రాజ‌స్తాన్ ఇప్పటివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదివ స్ధానంలో ఉంది.
చ‌ద‌వండి: IPL 2025: 'వారిద్ద‌రూ ఎంజాయ్ చేయ‌డానికి వ‌చ్చారు'.. స్టార్ క్రికెట‌ర్ల‌పై సెహ్వాగ్ ఫైర్‌
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)