Breaking News

IPL 2025: ఉత్కంఠ పోరు.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్ట‌రీ

Published on Sat, 05/03/2025 - 23:39

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓటముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో 2 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి పాలైంది. 214 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో సీఎస్‌కే విజ‌యానికి 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే 20 ఓవ‌ర్ వేసిన య‌శ్ ద‌యాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన ద‌యాల్‌.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత నాలుగో బంతికి ద‌యాల్ సిక్స్ ఇచ్చాడు. 

 అంత‌కు తోడు ఆ బంతి నో బాల్ కావ‌డంతో మ్యాచ్ సీఎస్‌కే వైపు మ‌లుపు తిరిగింది. చివ‌రి మూడు బంతుల్లో సీఎస్‌కే విజ‌యానికి కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే అవస‌ర‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలో ద‌యాల్ అద్బుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో యువ ఆట‌గాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

అత‌డితో పాటు ర‌వీంద్ర జ‌డేజా(77 నాటౌట్‌) రాణించాడు. సీఎస్‌కే ఓడిపోవ‌డంతో వీరిద్ద‌రి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.
కోహ్లి, షెపెర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లు..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్‌(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 

షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్‌, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానానికి చేరుకుంది.

 

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)