Breaking News

చాహ‌ల్‌.. వావ్ వాట్ ఏ టాలెంట్‌ మ్యాన్: మహవాష్ పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 04/16/2025 - 16:25

ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌కు అస‌లు సిస‌లైన క్రికెట్ మ‌జాను అందించింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో కేకేఆర్‌పై 16 ప‌రుగుల తేడాతో పంజాబ్ చారిత్ర‌త్మ‌క విజ‌యం సాధించింది. 

112 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిడిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్ర‌ను తిరిగ రాసింది. పంజాబ్ విజ‌యంలో స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్‌ది కీల‌క పాత్ర‌. చాహ‌ల్ త‌న స్పిన్ మ్యాజిక్‌తో కేకేఆర్ ప‌త‌నాన్ని శాసించాడు. ర‌హానే, రింకూ సింగ్‌, ర‌మ‌ణ్‌దీప్‌, ర‌ఘువ‌న్షి వంటి కీల‌క వికెట్ల‌ను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. 

ఫ‌లితంగా స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఇక చాహ‌ల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌పై అత‌డి రూమ‌ర్డ్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ స్పందించింది.

 తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లెగ్ స్పిన్నర్‌ను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. చాహల్‌తో క‌లిసి ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన మహవాష్.. ‘వావ్ వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచావు.  అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ధ‌న‌శ్రీ వ‌ర్మ‌తో చాహ‌ల్ విడాకులు తీసుకున్న త‌ర్వాత మహవాష్‌తో ప్రేమ‌యాణం కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లను చాహల్‌, మ‌హ్‌వ‌శ్ క‌లిసి వీక్షించ‌డం, అత‌డు ఆడే మ్యాచ్‌ల‌కు ఆమె హాజ‌ర‌వడం వంటివి ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వారు మాత్రం తాము కేవ‌లం స్నేహితులు మాత్రమే అని ఓ సంద‌ర్భంగా చెప్ప‌కొచ్చారు.
చ‌ద‌వండి: శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)