Breaking News

RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

Published on Sun, 05/04/2025 - 09:14

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్‌లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్‌ మొత్తం ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 

విరాట్‌ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్‌ పరుగులు సాధించిన ఘనత డేవిడ్‌ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్‌ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. విరాట్‌, వార్నర్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధవన్‌ అత్యధిక సీజన్లలో 500 ప్లస్‌ స్కోర్లు చేశారు. రాహుల్‌ 6, ధనవ్‌ 5 సీజన్లలో 500 ప్లస్‌ స్కోర్లు చేశాడు.  నిన్న (మే 3) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ ఎనిమిదో సారి ఓ సీజన్‌లో 500 ప్లస్‌ పరుగులు పూర్తి చేశాడు.

విరాట్‌ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సీజన్లు..
2015- 505 పరుగులు
2025- 505*
2018- 530
2011- 557
2013- 634
2023- 639
2024- 741
2016- 973

కాగా, నిన్నటి మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన విరాట్‌.. ఐపీఎల్‌లో ఎనిమిదో సారి 500 ప్లస్‌ పరుగులు సాధించడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. ఏడు అర్ద సెంచరీల సాయంతో 505 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ (సీజన్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌) సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ సాధించిన మరిన్ని రికార్డులు..
👉ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు  సీఎస్‌కేపై 1146 ప‌రుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్న‌ర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

👉 సీఎస్‌కేపై అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 10 సార్లు యాబైకిపైగా ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు శిఖ‌ర్ ధవ‌న్ పేరిట ఉండేది. ధవ‌న్ సీఎస్‌కేపై 9 సార్లు ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేశాడు.

👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున  300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్‌(263) ఉన్నాడు.

👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్న‌స్వామి స్టేడియంలో 151 కొట్టాడు.

👉ఐపీఎల్‌లో 8500 ప‌రుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. యశ్‌ దయాల్‌ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. 

ఈ మ్యాచ్‌లో మాత్రే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ వరుస బంతుల్లో ఔట్‌ కావడం​ సీఎస్‌కేకు టర్నింగ్‌ పాయింట్‌. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్‌లోకి తెచ్చాడు.

చివరి మూడు ఓవర్లలో (సుయాశ్‌, భువీ, దయాల్‌) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్‌లో తొలిసారి భువీ వికెట్‌ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0).

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)