Breaking News

IPL 2025: పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించిన ఆర్సీబీ

Published on Wed, 05/07/2025 - 22:09

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ముందు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో లక్నో (మే 9), సన్‌రైజర్స్‌ (మే 13), కేకేఆర్‌లతో (మే 17) తలపడనుంది.

కాగా, ఆర్సీబీకి సీఎస్‌కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్‌డౌన్‌ ఆటగాడు, ఇన్‌ఫామ్‌ ప్లేయర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్‌ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. మయాంక్‌ను ఆర్సీబీ కోటి రూపాయలకు ద​క్కించుకుంది. 

34 ఏళ్ల మయాంక్‌కు ఐపీఎల్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్‌లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో మయాంక్‌ సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌ మెగా వేలంలో మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. 

తమ తొలి టైటిల్‌ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్‌ల్లో మయాంక్‌ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్‌కు గతంలో (2011)  ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్‌ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్‌ దేవ్‌ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్‌ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 247 పరుగులు చేశాడు.

హ్యారీ బ్రూక్‌కు ప్రత్యామ్నాయంగా అటల్‌
లీగ్‌ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్‌ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు సెదిఖుల్లా అటల్‌తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో కొనసాగుతుంది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)