Breaking News

RCB VS CSK: చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sun, 05/04/2025 - 13:40

ఐపీఎల్‌ చరిత్రలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌పై  ఇంటా బయటా (ఒకే సీజన్‌లో) విజయాలు సాధించింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 3) హోం గ్రౌండ్‌లో సీఎస్‌కేపై విక్టరీ సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్‌ అవే మ్యాచ్‌లోనూ (సీఎస్‌కే హోం గ్రౌండ్‌లో) సీఎస్‌కేను చిత్తు చేసింది. 

బెంగళూరులో సీఎస్‌కేపై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. మే 28న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ ప్రారంభం నుండి ఆర్సీబీ సీఎస్‌కేపై ఎప్పుడూ ఒకే సీజన్‌లో ఇంటా బయటా విజయాలు సాధించలేదు.

ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగారు. 

ఆఖరి రెండు ఓవర్లలో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు స్థాయిలో 54 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ 19, 20 ఓవర్లలో సాధించిన అత్యధిక పరుగులు ఇవే. ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్న షెపర్డ్‌.. పతిరణ వేసిన చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0).

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.

సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్‌, కృనాల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)