Breaking News

PBKS VS MI, Qualifier 2 Updates: ముంబైపై పంజాబ్‌ విజయం

Published on Sun, 06/01/2025 - 19:17

ఫైనల్లో పంజాబ్‌
19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఫైనల్‌కు చేరిన పంజాబ్‌ కింగ్స్‌.

ఐదో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
169 పరుగుల వద్ద పంజాబ్‌ తన 5వ వికెట్‌ (షశాంక్‌) కోల్పోయింది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ 
156 పరుగుల వద్ద పంజాబ్‌ తన 4వ వికెట్‌ (నెహాల్‌) కోల్పోయింది.

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ 
72 పరుగుల వద్ద పంజాబ్‌ తన 3వ వికెట్‌ (జోష్‌) కోల్పోయింది.

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
55 పరుగుల వద్ద పంజాబ్‌ తన 2వ వికెట్‌ (ప్రియాన్ష్‌) కోల్పోయింది.

మొదటి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
3వ ఓవర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తన మొదటి వికెట్‌ కోల్పోయింది.

పంజాబ్‌ టార్గెట్‌ 204 పరుగులు
ముంబై ఇండియన్స్‌ తమ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు. దాంతో పంజాబ్‌కు 204 పరుగులు టార్గెట్‌గా నిర్దేశించారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ముంబై
చివరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ 6వ వికెట్‌ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు

ఐదో వికెట్‌ కోల్పోయిన ముంబై
17.6వ ఓవర​్‌- 180 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అజ్మతుల్లా బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా (15) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై
14.1వ ఓవర్‌- 142 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మ (44) ఔటయ్యాడు. 

ధాటిగా ఆడుతున్న తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌
తిలక్‌ వర్మ (43), సూర్యకుమార్‌ యాదవ్‌ (26) ధాటిగా ఆడుతున్నారు. ఫలితంగా ముంబై 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 

రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై
6.6వ ఓవర్‌- 70 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ బౌలింగ్‌లో జోస్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (38) ఔటయ్యాడు. 

5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ /1
జానీ బెయిర్‌స్టో 24, తిలక్‌ వర్మ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై.. రోహిత్‌ ఔట్‌
2.2వ ఓవర్‌- 19 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ కోల్పోయింది. స్టోయినిస్‌ బౌలింగ్‌లో వైశాఖ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ (8) ఔటయ్యాడు.

రోహిత్‌ శర్మకు లైఫ్‌
1.5వ ఓవర్‌- రోహిత్‌ శర్మకు రెండో ఓవర​్‌లోనే లైఫ్‌ లభించింది. జేమీసన్‌ బౌలింగ్లో ఒమర్‌జాయ్‌ కాస్త కష్టతరమైన క్యాచ్‌ డ్రాప్‌ చేశాడు. 

9:45 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌.. ఎలాంటి ఓవర్ల కోత లేదు
వర్షం​ కారణంగా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యమైన మ్యాచ్‌ ఎట్టకేలకు 9:45 గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఎలాంటి కోత లేదు. తొలి ఇన్నింగ్స్‌ 11:15 గంటల వరకు జరుగుతుంది. ఇన్నింగ్స్‌ విరామ సమయాన్ని 10 నిమిషాలకే కుదించారు. 11:25 గంటలకు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమవుతుంది. 12:55 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. 

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (జూన్‌ 1) క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్‌ స్థానంలో రీస్‌ టాప్లే.. పంజాబ్‌ తరఫున చహల్‌ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.

జట్ల వివరాలు..

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ

ఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)