Breaking News

IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటి..?

Published on Sun, 06/01/2025 - 21:08

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (జూన్‌ 1) పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్‌ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 

9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్‌ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్‌ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్‌ జరిగేలా లేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ సమయంలో లేని వర్షం మ్యాచ్‌ ప్రారంభ సమయానికి జోరందుకుంది.

మ్యాచ్‌ రద్దైతే ఏంటి పరిస్థితి..?
ఒకవేళ ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్‌ కింగ్స్ ఫైనల్‌కు చేరుతుంది. ప్లే ఆఫ్స్‌లో మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ అయినా జరుగుతుందేమో చూడాలి.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్‌ స్థానంలో రీస్‌ టాప్లే.. పంజాబ్‌ తరఫున హర్ప్రీత్‌ బ్రార్‌ స్థానంలో చహల్‌ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.

జట్ల వివరాలు..

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ

ఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)