Breaking News

IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్‌

Published on Thu, 05/29/2025 - 21:37

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్‌.. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. 

గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరిట ఉండేది. 2008 సీజన్‌లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ చేసిన 101 పరుగుల స్కోర్‌ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది.

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో అత్యల్ప స్కోర్లు..
82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)
87 - DC vs RR, ముంబై, 2008 SF
101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్
101 - PBKS vs RCB, ముల్లన్‌పూర్, క్వాలిఫైయర్ 1*
104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SF

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తలో 3, యశ్‌ దయాల్‌ 2, రొమారియో షెపర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. 

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), మార్కస్‌ స్టోయినిస్‌ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్‌ ఆర్య 7, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2, నేహల్‌ వధేరా 8, శశాంక్‌ సింగ్‌ 3, ముషీర్‌ ఖాన్‌ 0, హర్ప్రీత్‌ బ్రార్‌ 4 పరుగులకే ఔటయ్యారు.  

102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్‌ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం​ ఆ జట్టు స్కోర్‌ 30/1గా ఉంది. సాల్ట్‌ (14), మయాంక్‌ అగర్వాల్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)