Breaking News

IPL 2025: కోహ్లి, రోహిత్‌ కాదు.. రిటెన్షన్‌లో అత్యధిక ధర దక్కింది అతనికే..!

Published on Thu, 10/31/2024 - 19:11

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఇవాళ (అక్టోబర్‌ 31) విడుదల చేశాయి. ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే ఎంపికలు జరిగాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసమే చేశాయి. మరి కొన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్‌ ఆటగాళ్లను తప్పని పరిస్థితుల్లో వేలానికి వదిలేశాయి.

ఐపీఎల్‌ 2025 రిటెన్షన్స్‌ అందరూ ఊహించినట్టుగా విరాట్‌కు కాని రోహిత్‌కు కాని అత్యధిక ధర దక్కలేదు. వీరిద్దరితో పోలిస్తే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ అత్యధిక ధర దక్కింది. క్లాసెన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. భారత స్టార్ల విషయానికొస్తే.. విరాట్‌కు రూ. 21 కోట్లు.. రోహిత్‌కు రూ. 16.30 కోట్లు లభించాయి. ఐపీఎల్‌ రిటెన్షన్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. విరాట్‌తో సమానంగా లక్నో ఆటగాడు నికోలస్‌ పూరన్‌కు కూడా రూ. 21 కోట్లు లభించాయి.

పాట్‌ కమిన్స్‌ (సన్‌రైజర్స్‌), రుతురాజ్‌ (సీఎస్‌కే), బుమ్రా (ముంబై), రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌), సంజూ శాంసన్‌లకు (రాజస్థాన్‌), యశస్వి జైస్వాల్‌ (రాజస్థాన్‌), రవీంద్ర జడేజా (సీఎస్‌కే) రూ. 18 కోట్లు దక్కాయి. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కోటా కింద ఎంఎస్‌ ధోనికి అత్యల్పంగా రూ. 4 కోట్లు దక్కాయి.  కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ జాక్‌ పాట్‌ కొట్టాడు. అతని పారితోషికం రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్లకు పెరిగింది.

చదవండి: ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)