Breaking News

RR Vs PBKS: జన్సెన్‌పై కోపంతో ఊగిపోయిన బాలీవుడ్‌ గాయని

Published on Sun, 04/06/2025 - 16:48

బాలీవుడ్‌ గాయని, 'ముంజ్య' ఫేమ్‌ జాస్మిన్‌ సాండ్లాస్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జన్సెన్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది. నిన్న (ఏప్రిల్‌ 5) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. రియాన్‌ పరాగ్‌ అందించిన ఈజీ క్యాచ్‌ను జన్సెన్‌ నేలపాలు చేశాడు. 

దీంతో కోపం పట్టలేకపోయిన జాస్మిన్‌ జన్సెన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ ఆమె భావోద్వేగాలను నియంత్రించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇదే సీజన్‌లో ఓ సీఎస్‌కే ఫ్యాన్‌ గర్ల్‌ కూడా ఇదే తరహాలో (ధోని క్యాచ్‌ పట్టినందుకు) హెట్‌మైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. జన్సెన్‌ పరాగ్‌ క్యాచ్‌ నేలపాలు చేసినందుకు పంజాబ్‌ కింగ్స్‌ భారీ మూల్యమే చెల్లించుకుంది. లైఫ్‌ లభించాక పరాగ్‌ చెలరేగి ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ భారీ స్కోర్‌ (205/4) చేసింది. ఛేదనలో తడబడిన పంజాబ్‌ రెండు వరుస విజయాల తర్వాత సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది.

ఈ మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ సొంత మైదానమైన ముల్లన్‌పూర్‌ స్టేడియంలో జరిగింది. నూతనంగా ప్రారంభించబడిన ఈ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్‌. దీంతో స్టేడియంలో బీసీసీఐ గ్రాండ్‌గా ఓపెనింగ్‌ సెర్మనీని నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్‌ మరియు పంజాబీ గాయని జాస్మిన్ సాండ్లాస్ అద్భుతమైన ప్రదర్శనలతో  అలరించింది. ఈ మ్యాచ్‌ కోసం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు జాస్మిన్ పాటలకు ఉర్రూతలూగిపోయారు.

ఓపెనింగ్‌ సెర్మనీ తర్వాత జాస్మిన్‌ పంజాబ్‌కు మద్దతు ఇస్తూ.. ఆ జట్టు జెర్సీ ధరించి స్టాండ్స్‌లో కనిపించింది. ఈ క్రమంలో జన్సెన్‌ రియాన్‌ పరాగ్‌ క్యాచ్‌ వదిలేయడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. జాస్మిన్‌ జన్సెన్‌పై కేకలు వేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. జాస్మిన్‌ గతేడాది బాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన హరర్‌ సినిమా ముంజ్యలో పాటలు పాడింది. ఈ పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ముంజ్య సినిమా అతి తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు చేసింది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)