IPL 2025: ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ ఔట్‌

Published on Thu, 05/01/2025 - 23:13

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. ర్యాన్‌ రికెల్టన్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాయల్స్‌ బౌలరల్లో రియాన్‌ పరాగ్‌, తీక్షణ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్‌ (13), రియాన్‌ పరాగ్‌ (16), ధృవ్‌ జురెల్‌ (11), శుభమ్‌ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్‌ శర్మ, బౌల్ట్‌ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్‌ చాహర్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)