Breaking News

ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్ స‌ర‌స‌న‌

Published on Tue, 05/20/2025 - 21:52

చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 సిక్స‌ర్ల బాదిన జాబితాలోకి ధోని చేరాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ను అందుకున్నాడు.. రియాన్ ప‌రాగ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స‌ర్ బాదిన త‌లా.. ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ధోని ఇప్ప‌టివ‌ర‌కు 403 టీ20 మ్యాచ్‌లు ఆడి స‌రిగ్గా 350 సిక్స‌ర్లు బాదాడు. ఓవ‌రాల్‌గా ఈ  సాధించిన 34వ బ్యాట‌ర్‌గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో చేరిన నాలుగో భార‌త ఆట‌గాడిగా ధోని రికార్డుల‌కెక్కాడు. అత‌డి కంటే ముందు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ రికార్డు సాధించారు.

ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్ గేల్‌( 1,056 ) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో పోలార్డ్‌ (908), రసెల్‌ (747), పూరన్‌ (634), అలెక్స్‌ హేల్స్‌ (560), మున్రో (557), రోహిత్‌ (542), జోస్‌ బట్లర్‌ (537), మ్యాక్స్‌వెల్‌ (530) ఉన్నారు. ​కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా ధోని తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌ సాయంతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.

 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్‌(42), శివ‌మ్ దూబే(39) రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆకాష్ మధ్వాల్‌, యుధ్వీర్ సింగ్ చరక్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దేశ్‌పాండే, హ‌స‌రంగా త‌లా వికెట్ సాధించారు.
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)