Breaking News

భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 04/09/2025 - 17:26

భారత స్టార్‌ క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మకు చురక తగిలేలా కేకేఆర్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెటరన్‌ ఆటగాళ్లు వ్యక్తిగత లక్ష్యాల కోసం కెరీర్‌లను పొడిగించుకోకూడదని అలీ అన్నాడు. వయసు పైబడినా, జట్టు ప్రయోజనాలకు ఉపయోగపడకపోయినా స్వార్థపూరితంగా జట్టులో కొనసాగడం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డాడు.

సీనియారిటీ, పదవీ విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. వ్యక్తిగత లక్ష్యాల కోసం ఏ ఆటగాడూ కెరీర్‌ను పొడిగించుకోకూడదు. ఆటగాళ్లు సీనియారిటీ లేదా స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. వెటరన్లు సరిగ్గా పెర్ఫార్మ్‌ చేయనప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులు, ప్రతిభావంతులకు మార్గం చూపాలి. 

పేరున్న ఆటగాడనో లేక భారీ సంఖ్యలో అభిమానులున్నారనో జట్టును పట్టుకుని వేలాడకూడదు. వాస్తవికంగా ఆలోచించాలి. జట్టుకు ఏమైనా ఉపయోగపడుతున్నామా లేదా అన్నది​ పరీక్షించుకోవాలి. జట్టుకు భారమైనప్పుడు హుందాగా తప్పుకోవాలని అన్నాడు. 

మొయిన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు భారత స్టార్‌ క్రికెటర్లు, ప్రస్తుతం ఫామ్‌ లేమితో సతమతమవుతున్న ధోని, రోహిత్‌లకు చురక తగిలేలా ఉన్నాయి. ఈ ఇద్దరు వెటరన్‌ క్రికెటర్లు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2025లో పేలవంగా ఆడుతూ జట్టుకు భారమైపోయారు. చాలామంది వీరు తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ వారిలో ఏ మాత్రం చలనం లేదు. 

మాలో ఇంకా ఆడే సత్తా ఉందన్నట్లు ఊదరగొడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధోని అయినా కాస్త పర్వాలేదనిపించాడు కానీ రోహిత్‌ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. ధోని రోహిత్‌ కంటే దాదాపు ఐదేళ్లు పెద్ద వాడైనప్పటికీ తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాడు. 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధోని, రోహిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్‌కే, ముంబై జట్లు కూడా పేలవంగా ఆడతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తలో నాలుగింట ఓడి చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే, ముంబై ఐపీఎల్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో తలో ఐదు టైటిళ్లు నెగ్గాయి.

మొయిన్‌ విషయానికొస్తే..  ఈ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ కూడా వెటరన్‌ ఆటగాడే. ఇతని వయసు 37 ఏళ్లు. అయితే మొయిన్‌ సరిగ్గా పెర్ఫార్మ్‌ చేయనప్పుడు జాతీయ జట్టు నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌లో కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో మొయిన్‌ తనకు అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌ల్లో ఐదు పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. మొయిన్‌కు ఇంగ్లండ్‌ తరఫున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అనుభవం ఉంది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?