Breaking News

MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్‌ హెడ్‌.. గేల్‌, మ్యాక్స్‌వెల్‌ కంటే వేగంగా..!

Published on Thu, 04/17/2025 - 20:44

ఐపీఎల్‌ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 75/2గా ఉంది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (3 బంతుల్లో 2) ఔట్‌ కాగా.. ట్రావిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి సన్‌రైజర్స్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్‌ చాహర్‌ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్‌ ఓ ఓవర్‌లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్‌ జాక్స్‌ 2 ఓవర్లలో 12 (ఇషాన్‌ వికెట్‌), హార్దిక్‌ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్‌ వికెట్‌). 

ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌లకు మూడు లైఫ్‌లు లభించాయి. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్‌, హెడ్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో హెడ్‌ క్యాచ్‌ ఔటైనప్పటికీ నో బాల్‌ కావడంతో బ్రతికిపోయాడు.

1000 పరుగుల క్లబ్‌లో హెడ్‌
ఈ మ్యాచ్‌లో హెడ్‌ ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్‌ కేవలం​ 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్‌ మాత్రమే హెడ్‌ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్‌ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్‌.. విధ్వంసకర వీరులు క్రిస్‌ గేల్‌ (615), మ్యాక్స్‌వెల్‌ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు.. 
545 - ఆండ్రీ రస్సెల్
575 - ట్రావిస్ హెడ్*
594 - హెన్రిచ్ క్లాసెన్
604 - వీరేంద్ర సెహ్వాగ్
610 - గ్లెన్ మాక్స్వెల్
615 - క్రిస్ గేల్
617 - యూసుఫ్ పఠాన్
617 - సునీల్ నరైన్

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)