Breaking News

IPL 2025: రోహిత్‌, పోలార్డ్‌ తర్వాత సూర్యకుమార్‌

Published on Mon, 03/24/2025 - 11:51

ఐపీఎల్‌ 2025లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక సారధి సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్‌ శర్మ, కీరన్‌ పోలార్డ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

రోహిత్‌ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌ తరఫున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్‌ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నూర్‌ అహ్మద్‌ (4-0-18-4), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. సూర్యకుమార్‌ (29), తిలక్‌ వర్మ (31), ఆఖర్లో దీపక్‌ చాహర్‌ (15 బంతుల్లో 28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

రోహిత్‌ శర్మ డకౌట్‌ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్‌ (13), విల్‌ జాక్స్‌ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్‌ మింజ్‌ (3), నమన్‌ ధిర్‌ (17), సాంట్నర్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో అశ్విన్‌, ఇల్లిస్‌ కూడా తలో వికెట్‌ తీశారు.

ఛేదనలో రచిన్‌ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్‌కేను గెలిపించారు. రుతురాజ్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి సీఎస్‌కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం​ స్పిన్నర్‌ విజ్ఞేశ్‌ పుథుర్‌ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఓ దశలో సీఎస్‌కేకు దడ పుట్టించాడు.  ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్‌ జాక్స్‌ (4-0-32-1), నమన్‌ ధిర్‌ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్‌ ఓవర్లలో వీరిద్దరు సీఎస్‌కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్‌ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది.  

 

 

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు