Breaking News

సిరాజ్‌కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..

Published on Sun, 11/24/2024 - 18:19

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్‌ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌ సన్‌రైజర్స్‌ తరఫున 2017లో క్యాచ్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.

ఏడేళ్లు అక్కడే
అయితే,  ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.

చెన్నై కూడా రేసులో
ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్‌ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.

మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీ
ఈ దశలో రాజస్తాన్‌ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్‌ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్‌ విషయంలో రైటు మ్యాచ్‌ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం  తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది. 

ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్‌ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో సిరాజ్‌కు గుజరాత్‌ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.

ఇక ఐపీఎల్‌-2022 ద్వారాక్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్‌ రాహుల్‌కు భారీ షాక్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)