Breaking News

IPL 2025: భారీ ధరకు అమ్ముడుపోయిన అర్ష్‌దీప్‌.. మళ్లీ ఆ జట్టుకే

Published on Sun, 11/24/2024 - 16:01

టీమిండియా స్టార్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు జరిగిన  మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్‌లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్‌ సింగ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ పోటీకి వచ్చాయి.

అయితే, అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అర్ష్‌దీప్‌ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు అర్ష్‌దీప్‌ను వదిలేసిన పంజాబ్‌ కింగ్స్‌ రైజర్స్‌తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్‌ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది.

అయినప్పటికీ సన్‌రైజర్స్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్ష్‌దీప్‌ కోసం రూ. 18 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే, పంజాబ్‌ మాత్రం ఈ టీమిండియా స్టార్‌ను వదులుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో ఫైనల్‌ బిడ్‌గా రూ. 18 కోట్లకు అర్ష్‌దీప్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్‌ నిలిచాడు. 

కాగా లెఫ్టార్మ్‌ పేసర్‌ అయిన అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకు 65 మ్యాచ్‌లలో కలిపి 76 వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా తరఫున మాత్రం అతడికి టీ20లలో మాత్రం గొప్ప రికార్డు ఉంది.  ఇప్పటికి ఆడిన 60 మ్యాచ్‌లలోనే అతడు 95 వికెట్లు పడగొట్టడం విశేషం.  

చదవండి: RTM కార్డు విషయంలో ట్విస్ట్‌ ఇచ్చిన బీసీసీఐ.. ఈ వేలం మునుపటిలా ఉండదు!

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)