Breaking News

LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్‌ మార్ష్‌

Published on Tue, 05/27/2025 - 20:51

లక్నో సూపర్‌ జెయింట్స్‌ విధ్వంసకర ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్‌లో 201 మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌ 136 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో మార్ష్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌ 12 ఓవర్ల అనంతరం​ 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్‌ ప్రారంభం​ నుంచి అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మార్ష్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. రిషబ్‌ పంత్‌ (59), మిచెల్‌ మార్ష్‌ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 131/1గా ఉంది.

కాగా, ఈ సీజన్‌లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్‌ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్‌ మార్ష్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, నికోలస్‌ పూరన్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.

ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్‌-1 బెర్త్‌ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్‌ ఇదివరకే క్వాలిఫయర్‌ బెర్త్‌ సాధించగా.. మరో బెర్త్‌ కోసం పోటీలో గుజరాత్‌, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.  

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)