Breaking News

లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!?

Published on Sun, 07/21/2024 - 13:26

భార‌త మాజీ క్రికెట‌ర్, హైద‌రాబాదీ వీవీఎస్‌ లక్ష్మణ్ ఐపీఎల్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్‌లో లక్ష్మణ్ భాగం కానున్న‌ట్లు స‌మాచారం. 

ల‌క్నో ఫ్రాంచైజీ త‌మ కోచింగ్ స్టాప్‌లోకి భార‌త దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌ను తీసుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే లక్ష్మ‌ణ్‌పై క‌న్నేసిన‌ట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్‌గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.  ఇప్ప‌టికే ల‌క్ష్మ‌ణ్‌తో ల‌క్నో ఫ్రాంచైజీ చర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

కాగా ల‌క్ష్మ‌ణ్ ప్ర‌స్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్‌గా ఉన్నాడు. లక్ష్మణ్‌ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్‌ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం  అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.

లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్‌గా లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు. 

ఆ తర్వాత ఏన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత  ఎన్సీఏ ఛీప్‌గా  మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)