Breaking News

IPL 2025: ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Published on Wed, 06/04/2025 - 08:33

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. గ‌త 17 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ క‌ప్ ఎట్ట‌కేల‌కు ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్‌-2025 విజేత‌గా ఆర్సీబీ అవతరించింది. మంగ‌ళవారం అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన బెంగ‌ళూరు జ‌ట్టు.. తమ క‌ల‌ల ట్రోఫీని ముద్దాడింది. 

ఆర్సీబీ గెలుపుతో అభిమానుల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ‘‘ఈసాలా కప్‌ నమ్‌దు’’ నినాదాలతో స్టేడియం హోరెత్తి పోయింది. ఈ క్ర‌మంలో విజేత‌గా నిలిచిన ఆర్సీబీ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్‌ టీమ్‌ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

విజేత‌కు ఎన్ని కోట్లంటే?
👉ఛాంపియ‌న్స్‌గా నిలిచిన ఆర్సీబీకి ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు ల‌భించాయి. అదేవిధంగా ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న పంజాబ్‌కు రూ.12.5 కోట్లు  ప్రైజ్‌మనీ  ద‌క్కింది. ఇక క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓట‌మి పాలైన ముంబై ఇండియ‌న్స్‌కు  రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌ట్టిన‌ గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్లు లభించాయి.

👉ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా నిలిచిన సాయిసుద‌ర్శన్‌కు రూ.15లక్ష‌ల న‌గ‌దు బ‌హుమతి ల‌భించింది. ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన సుద‌ర్శ‌న్‌.. 54.21 స‌గ‌టుతో 759 ప‌రుగులు చేశాడు.

👉పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన ప్ర‌సిద్ద్ కృష్ణకు రూ.15లక్ష‌ల న‌గ‌దు బ‌హుమతి ల‌భించింది. ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ప్ర‌సిద్ద్.. 25 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

👉జితేశ్‌ శర్మ (సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌) రూ.లక్ష ప్రైజ్‌మనీ
👉శశాంక్‌ సింగ్‌ (ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్‌మనీ
👉శశాంక్‌ సింగ్‌ (సూపర్ సిక్సర్స్‌ ఆఫ్ ది మ్యాచ్‌) రూ.లక్ష ప్రైజ్‌మనీ
👉ప్రియాన్ష్‌ ఆర్యా (మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు) రూ.లక్ష ప్రైజ్‌మనీ
👉కృనాల్‌ పాండ్యా (గ్రీన్‌ డాట్‌ బాల్స్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌) రూ.లక్ష ప్రైజ్‌మనీ
👉కృనాల్‌ పాండ్యా (మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌) రూ.5లక్షల ప్రైజ్‌మనీ
👉సాయి సుదర్శన్‌ (ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ
👉వైభవ్‌ సూర్యవంశి (సూపర్ స్ట్రయికర్‌ ఆఫ్ ది సీజన్) టాటా కర్వ్ కారు విజేత
👉సాయి సుదర్శన్‌ ( ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ
👉నికోలస్‌ పూర్‌ (సూపర్ సిక్సెస్‌ ఆఫ్‌ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ
👉సాయి సుదర్శన్‌ (ది గో ఫోర్స్‌ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ
👉మొహ్మద్‌ సిరాజ్‌ (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ
👉కమిండు మెండిస్‌ (క్యాచ్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల క్యాష్‌ ప్రైజ్‌
👉ఫెయిర్‌ ప్లే అవార్డు (చెన్నై సూపర్‌ కింగ్స్‌) రూ.10లక్షల ప్రైజ్‌మనీ
👉ప్రసిద్ధ్‌ కృష్ణ (పర్పుల్‌ క్యాప్‌) రూ.10లక్షల ప్రైజ్‌మనీ
👉సాయి సుదర్శన్‌ (ఆరెంజ్ క్యాప్) రూ.10లక్ష ప్రైజ్‌మనీ
👉సూర్యకుమార్‌ యాదవ్‌ (మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌) రూ.15లక్షల ప్రైజ్‌మనీ
👉డీడీసీఏ (పిచ్‌ అండ్‌ గ్రౌండ్‌) రూ.50లక్షల ప్రైజ్‌మనీ



 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)