Breaking News

న‌రైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్‌కేపై కేకేఆర్ గ్రాండ్ విక్ట‌రీ

Published on Fri, 04/11/2025 - 23:01

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి పాలైంది. మ‌రోసారి సీఎస్‌కే బ్యాట‌ర్లు దారుణ ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 103 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(31 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. విజ‌య్ శంక‌ర్‌(29) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు కీల‌క మూడు వికెట్లు ప‌డ‌గొట్టి సీఎస్‌కే ప‌త‌నాన్ని శాసించాడు. న‌రైన్‌తో పాటు హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు, వైభ‌వ్ ఆరోరా, మోయిన్ అలీ త‌లా వికెట్ సాధించారు. కెప్టెన్ ధోని(1) సైతం తీవ్రనిరాశ‌ప‌రిచాడు.

సునీల్ న‌రైన్ విధ్వంసం..
అనంత‌రం 104 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి కేవ‌లం 10.1 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో సునీల్ న‌రైన్‌(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 44) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. డికాక్‌(23 ), ర‌హానే(20 నాటౌట్‌), రింకూ సింగ్‌(15 నాటౌట్‌) రాణించారు. 

సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్‌, అన్షుల్ కాంబోజ్ త‌లా వికెట్ సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన సునీల్ న‌రైన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా సీఎస్‌కేకు వ‌రుస‌గా ఇది ఐదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.
చ‌ద‌వండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్‌ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)