IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌..?

Published on Sun, 05/11/2025 - 16:46

భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా ఐపీఎల్‌-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు  తాత్కాలికంగా వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిస్థితులు కాస్త‌ చ‌ల్లార‌డంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌ను తిరిగి ప్రారంభించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స‌మాచారం. డబుల్‌ హెడర్‌ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే మే 25న ఈ ఏడాది సీజ‌న్‌కు ముగింపు ప‌ల‌కాల‌ని బీసీసీఐ యోచిస్తోంది.

ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌..
ఇక ఇది ఇలా ఉండ‌గా.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జత్ పాటిదార్ గాయం కార‌ణంగా క‌నీసం ఒక మ్యాచ్‌కైనా దూరమ‌య్యే అవ‌కాశ‌ముంది. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాటిదార్ చేతి వేలికి గాయమైంది. దీంతో అత‌డికి రెండు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. ఈ క్ర‌మంలో అత‌డు కనీసం రెండు మ్యాచ్‌ల‌కైనా దూర‌మ‌వుతాడ‌ని అంతా భావించారు.

కానీ ఐపీఎల్‌-2025లో మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డంతో ఆర్సీబీకి క‌లిసొచ్చింది. అత‌డు చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒక‌వేళ ఐపీఎల్‌-2025 మే 15 నుంచి తిరిగి ప్రారంభ‌మైతే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్‌ కానున్నాడు. పాటిదార్ గైర్హ‌జ‌రీలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేష్ శ‌ర్మ ఆర్సీబీ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని జితేష్ శ‌ర్మ ధ్రువీక‌రించాడు.

"ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో కెప్టెన్‌గా నాకు అవ‌కాశ‌మిచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెల‌పాల‌నుకుంటున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా గొప్ప విష‌యం. దేవదత్ ప‌డిక్క‌ల్‌, ర‌జిత్ పాటిదార్ ఇద్ద‌రూ అందుబాటులో లేనందున, వారిస్ధానాల‌ను ఎవ‌రితో భ‌ర్తీ చేయాల‌ని నేను ఆలోచిస్తున్నాను. 

నాకు నిజంగా ఇది చాలా పెద్ద బాధ్య‌త" అని ఐపీఎల్ స‌స్పెన్ష‌న్‌కు ముందు జితేష్ శ‌ర్మ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మే 15న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాక‌పోతే కెప్టెన్సీ అవకాశాన్ని జితేష్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
చ‌ద‌వండి: ENG vs IND: రోహిత్ శర్మ స్థానంలో యువ సంచ‌ల‌నం..? ఇక భార‌త్‌కు తిరుగులేదు?

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)