Breaking News

IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్‌ దిశగా దూసుకుపోతున్న గుజరాత్‌

Published on Tue, 04/22/2025 - 09:15

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.

ప్రస్తుతం ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు కూడా గుజరాత్‌ ఆటగాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సాయి సుదర్శన్‌ 8 మ్యాచ్‌ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ద్‌ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. 

బ్యాటింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్‌-10 జాబితాలో సాయి సుదర్శన్‌తో పాటు జోస్‌ బట్లర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్‌ టాపార్డర్‌లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరు సత్తా చాటుతున్నారు. 

బౌలింగ్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 బౌలర్ల జాబితాలో ప్రసిద్ద్‌ సహా ముగ్గురు గుజరాత్‌ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్‌లో రవిశ్రీనివాస్‌ సాయికిషోర్‌ ఊహలకందని విధంగా సత్తా చాటుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఈ ఏడాదే కొత్తగా గుజరాత్‌లో చేరిన సిరాజ్‌ సైతం ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 

గుజరాత్‌ విజయాల్లో మిడిలార్డర్‌ బ్యాటర్లు షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, రాహుల్‌ తెవాతియా, షారుఖ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. వెటరన్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఫామ్‌ ఒక్కటే ఈ సీజన్‌లో గుజరాత్‌ను కలవరపెడుతుంది. అతను కూడా నిన్న (ఏప్రిల్‌ 21) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. 

నిన్నటి మ్యాచ్‌లో రషీద్‌ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఇచ్చి 2 కీలక వికెట్లు (నరైన్‌, రసెల్‌) తీశాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ప్రతి ఒక్కరు మ్యాచ్‌ విన్నర్లుగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు సత్తా చాటుతూ విజయాన్నందిస్తున్నారు. 

బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్‌ నిలకడకు మారు పేరు అన్నట్లుగా మారిపోయాడు. గిల్‌ సామర్థ్యం మేరకు రాణిస్తుండగా.. బట్లర్‌ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు పేస్‌ త్రయం ప్రసిద్ద్‌, సిరాజ్‌, ఇషాంత్‌పై ఎవరికీ అంచనాలు లేవు. 

సాయికిషోర్‌ నుంచి అయితే ఈ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన అస్సలు ఊహించలేదు. సాయికిషోర్‌ ఎప్పుడు బంతిని పట్టుకున్నా వికెట్లు తీయడమే కాకుండా అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇతను ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. 

ఈ సీజన్‌లో గుజరాత్‌ ఇదే జోరును కొనసాగిస్తే రెండో టైటిల్‌ ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ​. అందరూ ఈ సీజన్‌లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్‌, లక్నో జట్లలో ఏదో ఒకటి టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గుజరాత్‌ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టైటిల్‌ దిశగా దూసుకుపోతుంది.

కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఎప్పటిలాగే టీమ్‌ ఎఫర్ట్‌ను చూపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. గిల్‌ (90), సాయి సుదర్శన్‌ (52), బట్లర్‌ (41 నాటౌట్‌) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 

అనంతరం ఛేదనలో గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్‌, రషీద్‌ ఖాన్‌ చెరో 2, సిరాజ్‌, ఇషాంత్‌, సుందర్‌, సాయికిషోర్‌ తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే ఒక్కడే హాఫ్‌ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్‌ ఏప్రిల్‌ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)