తీరు మార‌ని ఎస్ఆర్‌హెచ్‌.. వ‌రుస‌గా నాలుగో ఓట‌మి

Published on Sun, 04/06/2025 - 23:17

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ స‌న్‌రైజ‌ర్స్ విఫ‌ల‌మైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల దాటికి ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆదిలోనే హెడ్‌, అభిషేక్‌ను ఔట్ చేసి స‌న్‌రైజ‌ర్స్‌ను దెబ్బ‌తీశాడు.  సిరాజ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

అత‌డితో పాటు ప్ర‌సిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క్లాసెన్‌(27),కమ్మిన్స్‌(22) రాణించారు.

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. 
అనంత‌రం 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 16.4 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. గుజ‌రాత్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖ‌రి వ‌ర‌కు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. గిల్ (43 బంతుల్లో 9 ఫోర్ల‌తో 61 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(49), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(35 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ష‌మీ రెండ‌ వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. క‌మ్మిన్స్ ఓ వికెట్ సాధించారు. ఈ ఓట‌మితో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానానికి ప‌డిపోయింది.
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)