Breaking News

IPL 2025: గ్లెన్‌ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!

Published on Thu, 04/17/2025 - 21:46

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌గా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్‌ దసున్‌ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్‌లో కూడా గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌ మెగా వేలంలో షనక అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్‌ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది. 

షనక త్వరలోనే గుజరాత్‌ టైటాన్స్‌తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్‌లో గుజరాత్‌ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన షనకకు ఆ సీజన్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్‌లో గుజరాత్‌ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో రన్నరప్‌గా నిలిచింది. 

షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ (దుబాయ్‌) టైటిల్‌ గెలిచిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్‌రౌండర్‌ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్‌ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో గుజరాత్‌ తరఫునే మూడు మ్యాచ్‌లు ఆడాడు.

ఫిలిప్స్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్‌ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఫిలిప్స్‌ ఈ సీజన్‌లో  ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఏప్రిల్‌ 6న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్‌ సీజన్‌ మొత్తానికే దూరమ్యాడు.

గుజరాత్‌ ఈ సీజన్‌ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు  ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్‌ చెరో 6 మ్యాచ్‌లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌, సీఎస్‌కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)