Breaking News

GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్‌ బౌలింగ్‌ అద్భుతం: గిల్‌

Published on Sun, 03/30/2025 - 09:32

ఐపీఎల్‌ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్‌ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాప్‌-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్‌ను ప్రదర్శించాడు. 

శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్‌పై ఈ ముగ్గురు సూపర్‌గా బ్యాటింగ్‌ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బౌల్ట్‌ (4-0-34-1), దీపక్‌ చాహర్‌ (4-0-39-1), సాంట్నర్‌ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్‌ రెహ్మాన్‌ (2-0-28-1), యువ పేసర్‌ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్‌ శర్మను (8) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం​ ఐదో ఓవర్‌లో సిరాజ్‌ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్‌ రికెల్టన్‌ను (6) రోహిత్‌ తరహాలోనే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్‌ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 48; ఫోర్‌, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్‌ ప్రస్దిద్ద్‌ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్‌, స్కైలను ఔట్‌ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్‌ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

ప్రసిద్ద్‌ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్‌, స్కై ఔటయ్యాక హార్దిక్‌ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్‌ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్‌ (6 బంతుల్లో 3), హార్దిక్‌ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (11 బంతుల్లో 18 నాటౌట్‌), సాంట్నర్‌ (9 బంతుల్లో 18 నాటౌట్‌) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. 

ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్‌ కృష్ణకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. గుజరాత్‌ బౌలరల్లో ప్రసిద్ద్‌, సిరాజ్‌ చెరో 2, రబాడ, సాయికిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్‌ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.

మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను బ్లాక్‌ సాయిల్‌ పిచ్‌పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్‌ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. 

మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్‌ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్‌ ఖాన్‌ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్‌ను ఆఖర్లో బౌలింగ్‌ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)