Breaking News

IPL 2025: సాయి సుదర్శన్‌ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

Published on Wed, 04/09/2025 - 23:29

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్‌ ఖాన్‌ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్‌ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో 12 పరుగులు, రూథర్‌ఫోర్డ్‌ 3 బంతుల్లో సిక్స్‌ సాయంతో 7 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్‌, సందీప్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌ గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌ చెరో 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కేజ్రోలియా తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సంజూ శాంసన్‌ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (14 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

యశస్వి జైస్వాల్‌ (7 బంతుల్లో 6; ఫోర్‌), నితీశ్‌ రాణా (3 బంతుల్లో 1), ధృవ్‌ జురెల్‌ (4 బంతుల్లో 5; ఫోర్‌), శుభమ్‌ దూబే (3 బంతుల్లో 1), తుషార్‌ దేశ్‌పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్‌ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)