Breaking News

గుజరాత్‌ టైటాన్స్‌కు అదిరిపోయే శుభవార్త

Published on Mon, 05/05/2025 - 18:07

దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ కగిసో రబడ (Kagiso Rabada)కు భారీ ఊరట లభించింది. అతడిపై  ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. 

ఈ విషయాన్ని సౌతాఫ్రికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రగ్‌ ఫ్రీ స్పోర్ట్స్‌ (SAIDS) సోమవారం ధ్రువీకరించింది. రబడపై నిషేధం తొలగిపోయిందని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అతడు వెంటనే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుతో చేరేందుకు మార్గం సుగమమైంది.

రూ. 10.75 కోట్లకు కొనుగోలు
కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో గుజరాత్‌ ఫ్రాంఛైజీ రబడను రూ. 10.75 కోట్ల మేర భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల అనంతరం అతడు  ‘వ్యక్తిగత కారణాలతో’ దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. అయితే, ఇందుకు గల స్పష్టమైన కారణాన్ని మాత్రం ఐపీఎల్‌ యాజమాన్యం బయటకు వెల్లడించలేదు. రబడ త్వరలో మళ్లీ జట్టుతో చేరతాడని కూడా టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ టోర్నీ మధ్యలో ప్రకటించాడు.

PC: BCCI/IPL
అలాంటివి ఇందులో ఉన్నాయి.. అయితే..
అయితే కొన్ని రోజుల క్రితం అసలు వాస్తవం బయటకు వచ్చింది. డోపింగ్‌ పరీక్షలో పాజిటివ్‌గా దొరికిపోవడంతో రబడపై సస్పెన్షన్‌ వేటు పడింది. సరదా కోసం తీసుకునే (రిక్రియేషనల్‌) డ్రగ్‌ను రబడ వాడినట్లు తేలడంతో ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, పూర్తి స్థాయిలో ఇంకా ఎంత కాలం సస్పెన్షన్‌ వేటు పడుతుందనేదానిపై స్పష్టత రాలేదు.

తాజాగా SAIDS ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రబడపై నెల రోజుల పాటు పడిన నిషేధం తొలగిపోయినట్లు తెలిపింది. ‘‘రబడపై సస్పెన్షన్‌ నేపథ్యంలో అతడు ఇండియా నుంచి వెంటనే సౌతాఫ్రికాకు తిరిగి వచ్చాడు.

అయితే, డ్రగ్స్‌ వాడకానికి సంబంధించి రబడ తన తప్పును అంగీకరించాడు. కానీ దురుద్దేశంతో వాటిని వాడలేదన్న అతడి వాదన సబబుగానే ఉంది. వెంటనే అతడు మళ్లీ మైదానంలో దిగవచ్చు.

క్రీడా రంగం వెలుపలి సమాజంలో ఈ పదార్థాలు ఎక్కువగా దుర్వినియోగమవుతాయి కాబట్టి వీటిని అందరూ తప్పుగానే చూస్తున్నారు. కొకైన్‌, హెరాయిన్‌, ఎండిఎంఎ/ఎక్సటసీ, టీహెచ్‌సీ వంటివి ఇందులో ఉన్నాయి’’ అని సోమవారం నాటి ప్రకటనలో వెల్లడించింది.

కాగా క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్‌ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయివంటివాటిని రిక్రియేషనల్‌ డ్రగ్స్‌గా వ్యవహరిస్తారు. పోటీలు లేని సమయంలో ఆటగాళ్లు వీటిని వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి డ్రగ్స్‌ వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల వరకు నిషేధం పడుతుంది. 

సరదా కోసమే వాటిని వాడానని నిరూపిస్తే
అయితే తాను సరదా కోసమే వాటిని వాడానని, ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగడం లేదని సదరు ప్లేయర్‌ నిరూపించగలిగితే కేవలం 3 నెలల నిషేధం విధిస్తారు. ఇక రబడ విషయానికొస్తే.. సొంతగడ్డపై జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ టోర్నీ సమయంలో అతడు ఈ డ్రగ్‌ తీసుకున్నట్లుగా సమాచారం. 

ఇక ఇప్పుడు నెల రోజుల నిషేధం తొలగిపోవడంతో అటు గుజరాత్‌ టైటాన్స్‌తో చేరడంతో పాటు జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2025 ఫైనల్లోనూ అతడు ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అయింది.

కాగా ఐపీఎల్‌-2025లో కగిసో రబడ రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక రబడ రాకతో ఆ జట్టు పేస్‌ దళం మరింత పటిష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు. 

కాగా టైటాన్స్‌లో మహ్మద్‌ సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, ప్రసిద్‌ కృష్ణ, గెరాల్డ్‌ కోయెట్జి తదితర ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. వీరిలో ప్రసిద్‌ పది మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్‌ తన దగ్గర పెట్టుకున్నాడు. గుజరాత్‌ తమ పదకొండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో మంగళవారం తలపడుతుంది.

చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్‌.. ఒక్క చూపుతోనే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)